Home  »  TV News  »  Illu illalu pillalu : కడుపుతో ఉన్నానని వల్లి డ్రామాలు!

Updated : May 2, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -460 లో.. ధీరజ్ జరిగింది గుర్తుచేసుకొని బాధపడుతుంటే అప్పుడే ప్రేమ వస్తుంది. ఒరేయ్ జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతున్నావా.. ఇదంతా నా వల్లే కదా అని ప్రేమ అనగానే అలా అంటావేంటి నువ్వేం చేసావని ధీరజ్ అంటాడు. సంతకం పెట్టించమని నేను అన్నానని ప్రేమ అంటుంది. నా నగలు తీసుకొని డౌన్ పేమెంట్ చెయ్యమని చెప్తే వినట్లేదు. నా భర్తకి అందరి ముందు అవమానం జరిగింది.. ఎలాగైనా సరే రేపు నువ్వు కార్ కొంటావ్ నేను కొనిపిస్తానని ధీరజ్ తో ప్రేమ చెప్తుంది.

ఆ తర్వాత సాగర్ కి నర్మద బాక్స్ ఇస్తుంది. ఏంటి ఎప్పుడు లేనిది ఆస్తులు వాటా అని మాట్లాడుతున్నావు.. మావయ్య గారితో అలా మాట్లాడితే ఆయన మనసు ఎంత బాధపడుతుందో అర్ధం చేసుకోవా అని సాగర్ తో నర్మద అంటుంది. ఆయనకే మనసు ఉందా.. నాకు లేదా.. నేను బాధపడనా అని సాగర్ కోపంగా బాక్స్ తీసుకోకుండానే వెళ్ళిపోతాడు. ఏంటి అక్కా.. బావ నిన్న జరిగింది మనసులో పెట్టుకున్నాడా అని ప్రేమ అంటుంది. ఎప్పుడు గొడవ అయినా ఇంట్లో నుండి వెళ్ళిపోదామని అనేవాడు.. ఇప్పుడు ఆస్తులు, వాటా అంటున్నాడని నర్మద బాధపడుతుంది. అలా విడిపోకుండా అత్త చూసుకుంటుంది కదా అని ప్రేమ అంటుంది. అవును అత్త కన్పించడం లేదని ప్రేమ అంటుంది. ఇంటి ముందు ఎదురుగా ముగ్గు వేస్తూ కన్పిస్తుంది వేదవతి. ఇద్దరు కోడళ్ళు అక్కడికి వెళ్తారు. అదేం ముగ్గు అత్తయ్య అని ఆటపట్టిస్తారు. ఇంట్లో అంత జరిగింది కోడళ్ళు, కొడుకులు బాధపడుతున్నారు.. వాళ్ళతో మాట్లాడుదామని లేదా అని వేదవతితో నర్మద అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కోడళ్ళు, వేదవతి సరదాగా ముగ్గు వేస్తూ నవ్వుకుంటారు. అదంతా వల్లి చూసి కడుపుతో ఉన్న నన్ను వదిలేసి ఆ కోడళ్ళుతో కబుర్లు చెప్తున్నారా అని వల్లి కుళ్ళుకుంటుంది.

వాళ్ళని రామరాజు ముందు ఇరికించాలని కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ గిన్నెలు కింద పడేస్తుంది. ఆ సౌండ్ కి రామరాజు వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. ఆకలి వేస్తుంది మావయ్య అందుకే వంట చేసుకుంటున్నానని అంటుంది. దాంతో రామరాజు కోపంగా వేదవతి, నర్మద, ప్రేమని పిలుస్తాడు. మీరు ముగ్గురు ఉండి కూడా కడుపుతో ఉన్న వల్లితో పని చేయిస్తున్నారని కోప్పడతాడు. ఈ బెల్ తీసుకోమని వల్లికి ఇస్తాడు. నీకు ఏ అవసరం ఉన్నా.. ఈ బెల్ నొక్కు వచ్చి నీకేం కావాలో చూస్తారని రామరాజు అంటాడు. ఇక ఆ తర్వాత  అది కావాలి.. ఇది కావాలి అంటూ నర్మద, ప్రేమ, వేదవతిని ఒక అట ఆడుకుంటుంది వల్లి. ఆ తర్వాత ధీరజ్ ఇంకా డల్ గా ఉన్నాడని తనని డైవర్ట్ చెయ్యడానికి ప్రేమ ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.